యూపీలో స‌మాజ్‌వాదీ పార్టీ హ‌వా

ల‌క్నో: అఖిలేశ్ యాద‌వ్ నేతృత్వంలోని స‌మాజ్‌వాదీ పార్టీ దూసుకెళ్తోంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ త‌మ‌దే అన్న ధీమాలో ఉన్న బీజేపీకి .. ఎస్పీ ఊహించ‌ని షాక్ ఇచ్చిన‌ట్లు తాజా స‌మాచారం ప్ర‌కారం తెలుస్తోంది. 80 లోక్‌స‌భ స్థానాలు ఉన్న యూపీలో.. ప్ర‌స్తుత స‌మాచారం ప్రకారం ఎస్పీ సుమారు 30కిపైగా స్థానాల్లో లీడింగ్‌లో ఉన్న‌ది. బీజేపీతో క‌లిసి స‌మాజ్‌వాదీ .. పోటాపోటీగా ఫ‌లితాల్లో పోటీప‌డుతున్నది. బీజేపీ ప్ర‌స్తుతం 40 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్న‌ది. తొలి రౌండ్‌లో వార‌ణాసిలో ప్ర‌ధాని మోదీ వెనుకంజ‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం. అక్క‌డ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్య‌ర్థి అజ‌య్ రాయ్ ముందంలో ఉన్నారు. యూపీలో ఈసారి బీజేపీ 75 స్థానాల్లో పోటీ చేసింది. 5 సీట్ల‌ను కూట‌మి పార్టీల‌కు ఇచ్చింది. స‌మాజ్‌వాదీ పార్టీ 62 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ 17, తృణ‌మూల్ ఒక సీటులో పోటీ చేసింది.