యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
నిజామాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి ఆర్ తిరుమల ప్రసాద్ ఆధ్వర్యంలో రుద్రుర్ రైతువేధిక వద్ద వర్ని, రుద్రుర్ ,చందూర్ ,మొస్రా మరియు కోటగిరి మండలాలకు సంబంధించిన పెస్టిసైడ్ డీలర్ల కు మరియు పిఏసీయెస్ సొసైటీ సెక్రెటరీలకు గురువారం రోజున అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తిరుమల ప్రసాద్ మాట్లాడుతూ వచ్చే వర్షాకాలంలో ఎవరైనా యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠినచర్యలు తీసుకుంటామని అలాగే లైసెన్సులు కూడా రద్దు చేస్తామని చెప్పారు. ప్రతి ఎరువుల డీలర్ పిఓయెస్ మెషీన్ ద్వారానే నిర్ధారించిన ధరలకే ఎరువుల అమ్మకం జరపాలని అలాగే రైతులకు అమ్మే విత్తనాలు పురుగుల మందులు మరియు ఎరువులకు బిల్లు లు కచ్చితంగా ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమం లో ఏడిఎ వాజిద్ హుస్సేన్ , టెక్నికల్ ఏఓ లు శ్రీకర్ గోపి శ్రీనివాస్ లు, వర్ని ఎఓ నగేష్ రెడ్డి, కోటగిరి ఏవో లక్ష్మీకాంత్ రెడ్డి. 5 మండల కు సంబంధించిన డీలర్స్ మరియు పిఏసీయెస్ సీఈఓ లు పాల్గొన్నారు.