యోగ పోటిలో విద్యార్థికి అరుదైన గౌరవం

రామారెడ్డి     ఆగస్టు     22    జనంసాక్షీ  :
యోగ పోటిలో విద్యార్థికి అరుదైన గౌరవం దక్కింది. రామారెడ్డి మండలం రెడ్డిపేట్ స్కూల్ తండా గ్రామాల్లో ఉన్న జిల్లా ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి గత నెల 24వ తేదీన కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగ పోటీలలో రామారెడ్డి మండల పరిధిలోని జిల్లా పరిషత్ రెడ్డిపేట్ తాండ పాఠశాల 8వ తరగతి విద్యార్థి గంగావత్ సందీప్ జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలుర విభాగంలో 3వ స్థాయి  సాదించాడు. సెప్టెంబర్ నెలలో జరుగబోయే రాష్ట్రస్థాయి యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ చాంపియన్ షిప్  నేతృత్వంలో జరిగే పోటీలకు అర్హత సాధించాడు. ఈపోటీలలో పాఠశాల నుండి.
9 మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
రెడ్డిపేట్ తాండ విద్యార్థి గంగావత్ సందీప్ మరియు వారి తల్లిదండ్రులను రవి, వనితలను
పాఠశాల ఉపాధ్యాయ బృందం శాలువాతో సన్మానింపడం జరిగిందని ఉపాద్యాయులు తెలిపారు.  అలాగే యోగా నేర్పిన  ఉపాధ్యాయు లు లక్ష్మీ రాజంను  శాలువాతో ఘనంగా
పాఠశాల ఉపాధ్యాయ బృందం సన్మానించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్.శ్రీనివాస్  మాట్లాడుతూ,  యోగాతో ఆరోగ్యకర జీవితంతో పాటు ఆనందం, ఆహ్లాదం పొందడం జరుగుతుం దన్నారు. యోగాను ప్రతిఒక్కరూ పాఠశాల స్థాయిలో శనివారం నాడు నేర్చుకోవడం అలవా టు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం ఎస్.శ్రీనివాస్, జె. సుధారాణి, ఎస్. మహేందర్, సయ్యద్ ఖాజా, జి. అనురాధ, జి. ప్రశాంత్ కుమార్ తో పాటు సందీప్ తల్లి దండ్రులు రవి, వనితలు పాల్గొన్నారు.