రంజీల్లో జడేజా మూడో ట్రిపుల్ మూడు సార్లు త్రిశతకాలు సాధించిన క్రికెటర్‌గా రికార్డు
రాజ్‌కోట్, డిసెంబర్2: రవీంద్ర జడెజా ఆదివారం రంజీల్లో త్రిశతకం సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రవీంద్ర జడెజా ఇప్పటి వరకూ మూడుసార్లు త్రిశతకాలు సాధించాడు. రంజీ ట్రోఫీలో జడెజా ఈ రికార్డ్‌ను సాధించాడు. ఇప్పటి వరకు ఇండియన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మూడుసార్లు త్రిశతకం ఎవరూ సాధించలేదు. జడేజా మొదటి బ్యాట్సుమెన్. విజయ హజారే, రామన్ లంబా, వివిఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, వసీమ్ జాఫర్‌లు రెండేసి సార్లు త్రిశతకాలు సాధించారు. 24 ఏళ్ల రవీంద్ర జడెజా మూడుసార్లు త్రిశతకం సాధించడం ద్వారా తన పుట్టిన రోజుకు తానే మంచి బహుమతి ఇచ్చుకున్నాడు. ఈ నెల 6న జడేజా పుట్టిన రోజు. అంతర్జాతీయ క్రికెట్‌కు జడేజా దూరమై ఎనిమిది నెలలు. చివరిసారి ఆసియా కప్‌లో మార్చి 16న ఆడాడు. అదే సమయంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన సెంచరీల సెంచరీని పూర్తి చేశాడు. ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ అయిన జడేజా సౌరాష్ట్ర తరపున రైల్వేస్ జట్టుతో ఆడుతూ త్రిశకం సాధించాడు. ఈ సీజన్‌లో జడేజాకు ఇది సెకండ్ ట్రిపుల్ హండ్రెడ్. నవంబర్12న గుజరాత్‌లో జరిగిన మ్యాచ్‌లో 303 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో ట్రిపుల్ సెంచరీ(314) గత సంవత్సరం నవంబర్2011లో చేశాడు. ఈ రోజు సాధించిన ఈ ట్రిపుల్ సెంచరీతో జడేజా మూడు అంతకంటే ఎక్కువ త్రిశకాలు సాధించిన వారి జాబితాలో చోటు దక్కించుకున్నాడు. సర్ డాన్ బ్రాడ్‌మెన్ ఫస్ట్‌క్లాస్ ఆటలలో ఆరు ట్రిపుల్ సెంచరీలు చేశాడు. వాల్తేర్ హమ్మాండ్, బిల్‌ఫోన్స్‌లు నాలుగు చొప్పున బ్రయాన్ లారా, మైఖేల్ హస్సీ, గ్రేసు, హిక్ ఇపుడు జడేజాలు మూడు శతకాలు సాధించాడు.