రక్తదానం ప్రాణదానంతో సమానం.
తాండూరు జులై 6(జనంసాక్షి) రక్తదానం ప్రాణదానంతో సమానంతో సమానమని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరులోని ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో రక్తం నిలువలు తక్కువగా ఉన్నాయని గుర్తించి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజాబంధు టీం బుధవారం తాండూర్ లోని వైట్ ప్యాలెస్ లో మహా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అక్కడే ఉండి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా పరిస్థితుల్లో రక్త నిల్వలు తగ్గిపోయి ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇటువంటి సమయంలో రక్తదానం చేసి ఎంతో మందికి ప్రాణదాతలుగా నిలవడం అభినందనీయమని అన్నారు. ప్రాణాపాయం నుండి కాపాడే డాక్టర్లతో సహా రక్తదానం చేసిన వారు దేవుళ్లతో సమానం అన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రాజుగౌడ్, పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, కౌన్సిలర్ మంకాల రాఘవేందర్,
తాండూరు మండల అధ్యక్షులు రాందాస్,పెద్దేముల్ మండల అద్యక్షులు శ్రీనివాస్,యాలాల మండల అద్యక్షులు
రవీందర్ రెడ్డి, కోట్‌పల్లి మార్కెట్ కమిటి చైర్మన్ ఉప్పలి మహేందర్, టీఆర్ఎస్ తాండూరు ప్రచార కార్యదర్శి సాగర్ గౌడ్, దేవనూర్ సర్పంచ్ ఆకుల శివకుమార్,టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాబంధు ప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area