రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మేయర్ సుధారాణి

వరంగల్ ఈస్ట్, జులై 24 (జనం సాక్షి)
    రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు  కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం బల్దియా పరిధి మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న 29 వ డివిజన్ రామన్నపేట  లోగల డా. బాబు జగ్జీవన్ రామ్ మున్సిపల్ కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి ఆదివారం ప్రారంభించారు.
   ఈ సందర్భంగా రక్త దాతలకు సర్టిఫికెట్లను మేయర్ ప్రధానం చేశారు. అంతకు ముందు కుంటి భద్రయ్య ఆలయ సమీపం లో మేయర్ మొక్కలు నాటారు.
    అనంతరం మేయర్ మాట్లాడుతూ విశ్లేషకులు కే.టి.ఆర్.ను  ఫ్యూచర్ క్రియేటర్ ఆఫ్ న్యూ తెలంగాణ గా పేర్కొంటున్నారని,ఐ.టి.పరిశ్రమ కు సంబంధించి యావత్ ప్రపంచం నేడు హైద్రాబాద్ వైపు చూస్తుందని అట్టి ఘనత కే.టి.ఆర్.కు దక్కుతుందని, వరంగల్ నగరాన్ని భవిష్యత్ నగరం గా తీర్చిదిద్దడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని వారికి భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు, దీవెనలు ఉండాలని మేయర్ అభిలాషించారు.
 ఇట్టి కార్యక్రమంలో స్థానిక  డివిజన్ వాసులు ఎండి షఫీ,సదాన్త్, రాచర్ల రాము,రుద్ర శ్రీనివాస్,రాచర్ల జగన్,గట్టు చందు, రామగిరి ముఖేష్, మామునూరు రాజు,మాళ్వ రాజు, కాసర్ల చంద్రమౌళి, భీమ్ రాజ్, చిన్న క్రాంతి తదితరులు పాల్గొన్నారు.