రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలి: ప్రధాని మోదీ
ఏరో ఇండియా ప్రారంభం
బెంగళూరు,ఫిబ్రవరి18(జనంసాక్షి): రక్షణరంగంలో స్వయం సమృద్ధిని సాధించడమే లక్ష్యమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రక్షణ రంగ సామగ్రి ఎగుమతి చేసే స్థాయికి మనం చేరాలని ఆకాంక్షించారు. రక్షణరంగంలో 7 బిలియన్ డాలర్ల మేర ఉత్పత్తికి అవకాశముంది, మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో రక్షణరంగం కీలమని ప్రకటించారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన ఏరో ఇండియా -2015 ప్రదర్శనను ప్రధానమంత్రి బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ… ఏరో ఇండియా ప్రదర్శన ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందన్నారు. రక్షణశాఖకు సంబంధించి 50శాతం మేర దిగుమతి చేసుకుంటున్నాం… రక్షణ రంగం కొనుగోళ్ల విధానంలో సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు. రక్షణ రంగ పరికరాల ఉత్పత్తులపై స్వావలంబన సాధించాలన్నారు. భద్రతా బలగాలను ఆధునీకరించాల్సిన అవసరముందన్నారు. వచ్చే పదేళ్లలో వైమానిక రంగంలో 2లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, రక్షణ రంగ పరిశ్రమలో భారత్ ప్రపంచ కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు.
రక్షణ దళాలను ఆధునీకరించాల్సిన అవసరంఉందన్నారు. రక్షణ రంగ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి మనం ఎదగాలన్నారు. రక్షణ సామాగ్రి కొనుగోలు విధానంలో మార్పులు తేవాలన్న ఆయన అవసరమైతే రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను పెంచుతామని చెప్పారు. అంతర్గత భద్రతా సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. రక్షణ రంగం అభివృద్ధికి శాస్త్రవేత్తలు నడుం బిగించాలని తెలిపారు. రక్షణ రంగంలో 7 బిలియన్ డాలర్ల మేర ఉత్పత్తికి అవకాశం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఐదురోజుల పాటు వైమానిక ప్రదర్శన జరుగనుంది. కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ… రక్షణ రంగ ఉత్పత్తులపై స్వావలంబన సాధించాలన్నారు. రక్షణరంగ పరికరాలపై మేక్ ఇన్ ఇండియా ఉండాలని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో రక్షణ రంగం కీలకమని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్, కర్నాటక ముఖ్యమంత్రి సిద్దా
రామయ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఎయిర్‌షోలో సుఖోయ్‌లు అదురగొట్టాయి.
ఆకాశంలో విన్యాసాలు చేస్తూ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా ప్రదర్శనలో భారత వైమానానికి దళం సత్తా చాటింది. బ్రెట్లింగ్ వాకర్‌షో అదరగొట్టింది. ప్రధాన మంత్రి మంత్రి నరేంద్ర మోదీ ఎయిర్‌షోను ప్రారంభించాక అనంతరం యుద్ధ విమానాల ప్రదర్శనను వీక్షించారు.