రక్షాబంధన్ భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనం.

మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు.
తాండూరు అగస్టు 12(జనంసాక్షి)
రక్షాబంధన్ భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు పేర్కొన్నారు.రాఖీ పౌర్ణిమ పండుగ సందర్భంగా శుక్రవారం  ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కి మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు రాఖీ కట్టారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలో భాగంగా  శుక్రవారం ఎమ్మెల్యే రోహితన్న తో కలసి టీ.ఎస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో రక్షాబంధన్ సంబరాల్లో పాల్గొనడం జరిగింది.అనంతరం హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం రాఖీలు క‌ట్టి స్వీట్లు తినిపించారు. తాండూరు నియోజకవర్గ అన్నదమ్ములకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు మాట్లాడుతూ అన్నా చెల్లెల్ల బందానికి ప్రతీక రక్షాబందన్ అని  సంతోషంగా అందరూ పండగ జరుపుకోవాలని అన్నారు.ఈ పండుగ రోజు  అక్క-తమ్ముడు  అన్నా-చెల్లెలు  ఎంతో అనురాగంతో   ప్రేమను పంచుకుంటారని, ఎంతో దూరం ఉన్న  అన్న కోసం  చెల్లెలు తమ్ముడి కోసం అక్క అక్కడికి చేరుకొని  ప్రేమపూర్వకంగా రాఖీలు కట్టడం జరుగుతుందాని,ప్రేమ, కరుణ, సహన సీలతకు రాఖీలు నిదర్శనమన్నారు.రాఖీ అనగా రక్షణ బంధం అని,అన్నా-చెల్లెళ్ల, అక్కా-తమ్ముళ్ల మమతానురాగాల బంధం రక్షా బంధనం ఆని ఆమె పేర్కొన్నారు.రక్షాబంధన్ సంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని, ప్రజలలో సహోదరతత్వాన్ని మరింత పెంచుతుందని ఆకాంక్షించారు.