రన్నింగ్ ట్రాక్ కోసం 3 లక్షలు కేటాయిస్తా

బోథ్ (జనంసాక్షి) బోథ్ పట్టణ యువత కోరిక మేరకు తన నిధుల నుండి రూ. 3 లక్షలు మంజూరు చేస్తున్నట్లు జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు తాహేర్ బిన్ సలాం తెలిపారు. గురువారం ఆయన ఈ మేరకు వివరాలను ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని యువత పోలీసు, ఆర్మీ తదితర ఉద్యోగాల కోసం స్థానిక కళాశాల మైదానంలో రన్నింగ్ ట్రాక్ కోసం విజ్ఞప్తి చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని, ఈ మేరకు జిల్లా పరిషత్ నిధుల నుండి ఈ నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.