రమాదేవి దుష్ప్రచారాలను మానుకోవాలి ముధోల్ లో బిజెపి గెలుపు ఖాయం
భైంసా రూరల్ అక్టోబర్ 28 జనం సాక్షి
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ మిల్లులో భాజపా మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా మాజీ అధ్యక్షురాలు పడకంటి రమాదేవి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఇప్పటివరకు రమాదేవిపై ఒక్క కమ్యునల్ కేసు నమోదుకాలేదని అక్కడ కేవలం బీజేపీ కార్యకర్తలు, హిందువాహిని కార్యకర్తలపై మాత్రమే కేసులు అయ్యాయని రమాదేవి దుష్ప్రచారం చేసుకుందని కార్యవర్గ సభ్యుడు రవిపాండే ఆరోపించారు. నిర్మల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్ రావుల రాంనాథ్ జోష్యం చెప్పారు. పార్టీలో రమాదేవికి ఒక సముచిత స్థానం ఇచ్చామని ఇందులో భాగంగానే రెండు పర్యాయాలు ఎమ్మెల్యే అభ్యర్థిగా, రెండుసార్లు జిల్లా అధ్యక్షురాలిగా పార్టీ అధిష్టానం అవకాశం కల్పించిందన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవడంలో రమాదేవి విఫలమైందన్నారు. పార్టీలోనే ఉండి ఉంటే రమాదేవికి గౌరవం దక్కేది పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరడంతో కార్యకర్తల్లో సైతం ఆమెపై ఉన్న మర్యాద పోగొట్టుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మల్లారెడ్డి పెద్దపల్లి ఇన్చార్జ్ రావుల రామనాథ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు పైడిపల్లి గంగాధర్ మెడిసమ్మ రాజు రాజేశ్వర్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి పాండే నారాయణరెడ్డి నాయకులు కౌన్సిలర్లు పాల్గొన్నారు