రాకేష్ ది కేంద్ర బీజేపీ ప్రభుత్వ హత్య..
మోదీ మూల్యం చెల్లించుకోక తప్పదు..
-ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..
వరంగల్ ఈస్ట్,జూన్ 18(జనం సాక్షి):
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ సికింద్రాబాదులో పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన రాకేష్ ది కేంద్ర బిజెపి ప్రభుత్వ హత్యేనని వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు . శనివారం వరంగల్ లో ఎమ్మెల్యే నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రైతులు,జవాన్ ల ప్రాణాలు బీజేపీ ప్రభుత్వం తీస్తుందన్నారు..అగ్నిపథ్ పేరుతో ఆర్మీలో నాలుగేళ్ళ రిక్రూట్ మెంట్ తీసుకువచ్చి సైనికుల హక్కులను మోదీ ప్రభుత్వం కాల రాస్తుందని ఎమ్మెల్యే విమర్శించారు.నిరసన తెలిపినందుకు పేద విద్యార్థిని కాల్చిచంపడం హేయమైన చర్య అన్నారు.దేశవ్యాప్తంగా ఈ అంశంపై అగ్గిరాజేసుకుందన్నారు ఈ అగ్గిలో కేంద్ర ప్రభుత్వం మాడి మశైపోతుందన్నారు..ఆదాని అంబానీలకు కొమ్ముకాస్తూ రైతులకు వ్యతిరేఖంగా నల్లచట్టాలు తీసుకొచ్చి ప్రశ్నిస్తే రైతులను కాల్చిచంపాలని,నేడు అగ్నిపథ్ ను ప్రశ్నిస్తే పరిక్షలు రాసి ఎంపికైన అభ్యర్థులను కాల్చి చంపుతున్నారన్నారు..ఓట్లు సీట్లే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని,ప్రజల అవసరాలు,ఆకాంక్షలు బీజేపీకి పట్టవన్నారు.మతం పేరుతో ప్రజల్లో విద్వేశాలు రెచ్చగొట్టడం తప్ప బీజేపీకి తెలిసిందేం లేదన్నారు..రాకేష్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండగా నిలిచారన్నారు..వారికి 25 లక్షల పరిహారం,రాకేష్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అందజేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ణతలన్నారు.రాకేష్ కుటుంబానికి అండగా ఉంటామని,కేంద్రప్రభుత్వానికి,బీ జేపీకి ప్రజలు తగిన బుద్ది చెప్పాలన్నారు.. శనివారం రాకేశ్ మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం వద్ద సందర్శించి అనంతరం రాకేష్ మృతదేహంతో ర్యాలీ నిర్వహించారు. అలాగే ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వివిధ డివిజన్ల కార్పొరేటర్లు నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణులు,ప్రజలు,యువత పాల్గొన్నారు..
2 Attachments