రాజంపేట్ ఊర చెరువు పట్టించుకోని అధికారులు
రాజంపేట్ మండల కేంద్రంలోని ఊర చెరువు సమస్యల పైన బిజెపి మండల స్థాయి సభ్యులు గ్రామ సభ్యులు సందర్శించారు బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పిట్ల శీను జనంసాక్షి టీవీతో మాట్లాడుతూ రాజంపేట్ ఊర చెరువు చాలా పెద్దది ఇది గత సంవత్సరమే చెరువు ప్రమాదం అంచున చేరింది నిండు కుండలా ఉన్న ఊర చెరువు కట్ట పటిష్టంగా లేదని అదే చెరువు అలుగు తెగిపోయి అక్కడ పెద్ద గుంత ఏర్పడింది రైతన్నల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు వారి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని అధికారులు తెలియజేస్తే అధికారులు పోయిన సంవత్సరమే సమస్య స్థలాన్ని సందర్శించారు వాస్తవమేనని ధ్రువీకరించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కానీ మళ్లీ వర్షాకాలం ప్రారంభం అయింది అయినా ఇప్పటి వరకు ఏ అధికారి ఏ నాయకుడు స్పందించి సమస్యను పరిష్కరించ లేరు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది కాబట్టి ముందస్తు జాగ్రత్తగా అధికారులు స్పందించి బలహీనంగా ఉన్న కట్టను బలోపేతం చేయాలని అలాగే ఆలుగును పునరుద్ధరించాలని రైతన్నలు గ్రామస్తులు నష్ట పోకుండా ఊర చెరువును కాపాడాలని బిజెపి పార్టీ తరఫున బిజెపి నాయకులు డిమాండ్ చేశారు వారం రోజుల లోపు ఈ సమస్య పరిష్కారానికి అధికారుల స్పందించకపోతే గ్రామ స్థాయిలో రైతులతో కలిసి భారీ ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు