రాజంపేట్ మండల కాంగ్రెస్ నాయకులు అరెస్ట్
జనం సాక్షి. రాజంపేట్
తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియాగాంధీపై రాహుల్ గాంధీ ఈడీ పేరుతో మోడీ చేస్తున్న అక్రమ కేసులకు నిరసనగా హైదరాబాదులో నెక్లెస్ రోడ్ నుండి ఈడి ఆఫీసుకు పాదయాత్ర చేయడానికి వెళుతున్న రాజంపేట్ మండల కాంగ్రెస్ నాయకులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సోనియా గాంధీ పై రాహుల్ గాంధీ పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని లేనిపక్షంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు అరెస్ట్ అయిన వారిలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు యాదవ రెడ్డి సీనియర్ నాయకులు కే వీరన్న ఆరెపల్లి సర్పంచ్ కొమ్ము యాదగిరి రాజంపేట్ పట్టణ అధ్యక్షులు రంగ గంగాధర్ గౌడ్ మండల యూత్ అధ్యక్షులు కృష్ణారావు తదితరులను అరెస్టు చేశారు