రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటం ఆడతారా !

రైతుబంధు వద్దని కాంగ్రెస్ ఎలా చెబుతుంది ?

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి బ్యూరో అక్టోబర్ 27( జనంసాక్షి)

రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటం ఆడతారా అని, రైతుబంధు వద్దని కాంగ్రెస్ ఎలా చెబుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
సూటిగా ప్రశ్నించారు.వనపర్తి జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ
వందేళ్ల వయసు దాటినా కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పరిణతి లేదు .. రాజకీయ అవలక్షణాలు వదిలించుకోవడం లేదని,
సుధీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ అధ్వాన్నస్థితికి చేరుకున్నదని విమర్శించారు.
ప్రజల అంశాల మీద ఎన్నికలు గెలవాలి తప్ప, అడ్డుపుల్లలు వేసి లబ్ది పొందాలనుకోవడం రాజకీయం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
రైతుబంధు ఎన్నికల కోసం కాదని,
కామన్ సెన్స్ లేని కాంగ్రెస్ పార్టీ,
వానాకాలం, యాసంగి పంట కాలాలకు రైతుబంధు అందజేస్తున్నామని,
ఇప్పటి వరకు 11 విడతలలో రూ.72,815 కోట్లు రైతుల ఖాతాలలో జమచేశామని,
ప్రతి సీజన్ లో ఎకరాల వారీగా రైతుబంధు జమచేస్తున్నామంజి తెలిపారు.
తెలంగాణలో 92.5 శాతం భూమి సన్న, చిన్నకారు రైతుల చేతుల్లోనే ఉందన్నారు.
ఏడు వేల కొనుగోలు కేంద్రాలు గ్రామాల్లో పెట్టి రైతులకు రవాణ ఖర్చు లేకుండా తెలంగాణ ప్రభుత్వం కల్లాల వద్ద వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నదని, వానాకాలం వరి ధాన్యం కూడా కొనవద్దని కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకున్నదా ? దమ్ముంటే స్పష్టం చేయాలని అన్నారు.
ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యాక కొత్త పథకాలు, కొత్త ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉండవని,అప్పటికే నడుస్తున్న పథకాలకు వర్తించదని ఎన్నికల కమీషన్ స్పష్టంగా నిబంధనల్లో పేర్కొన్నదని గుర్తుచేశారు.రైతుబంధు వద్దని కాంగ్రెస్ పార్టీ రాసిన లేఖను తెలంగాణ రైతాంగం అర్ధం చేసుకోవాలని కోరారు.కాంగ్రెస్ నేత ఒకరు మూడు గంటల కరంటు చాలు అంటారు,
కర్ణాటకలో ఎన్నికల హామీలు నెరవేర్చలేక ఐదు గంటలకన్నా ఎక్కువ కరంటు ఇవ్వలేమని అక్కడ కరంటు మంత్రి తేల్చిచెప్పారు,
కర్ణాటక రైతులు తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ ను నమ్మి మోసపోయాం కాంగ్రెస్ పార్టీకి మీరు మోసపోవద్దని తెలంగాణకు వచ్చి చెప్పి పోతున్నారని తెలిపారు.కాంగ్రెస్ నేత ఉత్తమ్ రైతుబంధు పేరుతో రైతుల ఖాతాల్లో వేస్తున్న డబ్బులు దుబారా అని చెబుతున్నారని,
రైతులు ఎప్పుడైనా ప్రతి రూపాయి జాగ్రత్తగా పెట్టుబడికి ఖర్చు పెడతారని,కష్టం తెలిసి భూమిని, చెమటను నమ్ముకున్న వాడు రైతు
రైతులు పెట్టుబడికి ఎవరివద్ద చేయిచాచవద్దని కేసీఆర్ ఎంతో ఉన్నతమైన ఆలోచనతో రైతుబంధు తీసుకువచ్చారన్నారు.
రైతుబంధు పథకాన్ని అంతర్జాతీయ సంస్థ యూఎన్ఓలోని ఎఫ్ఎఓ విభాగం ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న అత్యుత్తమ పథకాల్లో రైతుబంధు, రైతుభీమా గొప్పవని ప్రశంసించిందని గుర్తుచేశారు.రైతుబంధు వద్దని కాంగ్రెస్ రాసిన లేఖ వారి అక్కసును బయటపెట్టిందన్నారు.తెలంగాణ రైతాంగం బాగుపడడం కాంగ్రెస్ కు ఇష్టం లేక,
అబద్దాలతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కోరుకుంటున్నది.హుజూరాబాద్ ఎన్నికలకు ముందే దళితబంధు మొదలుపెట్టాం దానిని కూడా వద్దని కాంగ్రెస్ చెబుతున్నది,
అణగారిన వర్గాలకు అండగా నిలవాలని తెలంగాణ ప్రభుత్వం దీనిని మొదలుపెట్టింది దశలవారీగా అందరికీ అండగా నిలవాలన్నది ప్రభుత్వ ఆలోచన,ఎస్సీ కార్పోరేషన్ ద్వారా ఎంత మంది దళితుల జీవితాల్లో మార్పులు తెచ్చారు,ఎన్నికల కమీషన్ కు రైతుబంధుతో పాటు పేర్కొన్న ఇతర అంశాలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.కరోనా విపత్తులోనూ తెలంగాణలో ప్రత్యేక మార్గదర్శకాలతో వ్యవసాయ రంగానికి మినహాయింపు ఇచ్చామని,కొనుగోలు కేంద్రాలు పెట్టి జాగ్రత్తలు వహించి ధాన్యం సేకరించాం,
ఎవరు ఎన్ని ఆటంకాలు కల్పించినా మిగిలిపోయిన రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పారు.యాసంగి రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పారు.రైతులు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాగం తిరుపతి రెడ్డి
మాట్లాడుతూ నేను 20 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని,నీళ్ల నిరంజన్ రెడ్డి అని ఎందుకు అంటారు అంటే ప్రతి ఎకరాకు నీళ్లు వస్తున్నాయి .. ఎండాకాలంలో కూడా కాల్వలో నీళ్లను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు.తెలంగాణలో , నియోజకవర్గం లో జరుగుతున్న అభివృద్ధి ని చూసి సీఎం కేసీఆర్ , రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ల నాయకత్వంలో పనిచేయాలని పార్టీలో చేరాను అని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తీవ్ర సంక్షోభంలో ఉన్నదని,కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అంటే తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఒక్కసారి ఒక్కసారి అంటూ కాంగ్రెస్ నుండి మూడు సార్లు పోటీ చేస్తున్నారు ..,మూడు నెలల కిత్రం వచ్చిన వారు టికెట్ నాకే వస్తుంది అని చెబుతున్నారని విమర్శించారు.

బీఆర్ఎస్ పార్టీలో చేరిన హైకోర్టు న్యాయవాది

హైకోర్టు న్యాయవాది రాధ , అనంతరం జగత్ పల్లి విష్ణు ఆధ్వర్యంలో 30 మంది కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టి లో చేరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ , జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ , శిక్షణ తరగతుల జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి , నాగం తిరుపతి రెడ్డి , కౌన్సిలర్లు కంచె రవి , పుట్టపాకుల మహేష్ , నాగన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు