రాజకీయ నాయకులు కూడా నన్నేమి చేయలేరని అహంకారం తోనే…ప్రిన్సిపాల్ అగాడలు

  ట్రైబల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలి
*చూసి చూడనట్లుగా వ్యవహారిస్తున్న ఆర్ సి వో. సంపత్ కుమార్
*ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి జేవారే రాహుల్*
*(ఏ.ఐ.ఎస్.బీ) కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్*
: ఎల్లారెడ్డి  21   ఆగస్ట్  (జనం సాక్షి)    కేంద్రంలో బాలికల గురుకుల పాఠశాలలో రాత్రి బెండకాయ కూర అన్నంతో తినడం వలన ఫుడ్ పాయిజన్ అయిందని విద్యార్థులు చెప్తున్నారు.హాస్టల్ లో ఉండే సిబ్బంది సినిమా చూసిన హాల్లో తినుబండలు తినడం వలన చెప్పడం వల్ల ఫుడ్ పాయిజన్ కు కారణమని చెప్తా ఉన్నారు ఎంతో హాస్యాస్పదంగా ఉందని
(ఏ.ఐ.ఎస్.బీ) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి జెవరే రాహుల్ మరియు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ అన్నారు.. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇంతకుముందు బాలికల గురుకుల పాఠశాలలో ఎలుక దాడి జరిగింది అలాగే ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అవ్వడం వలన 40 మంది అమ్మాయిలు అస్వతకు గురి అవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలో సమస్యలు లేవు నాణ్యమైన చదువును మంచి భోజనం అందిస్తున్నాం అనడమే తప్ప రోజుకో హాస్టల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయాని వారు అన్నారు.ఇందంట మండల విద్యాధికారి పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుందని వారు అన్నారు.ఇంత జరుగుతున్న మాత్రం జిల్లా ఉన్నత అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులు చూసి చూడట్లుగా వ్యవహారిస్తునరాని వారు పేర్కొన్నారు.కావున వెంటనే ఈ పాఠశాల ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని,మండల విద్యాధికారిపై తాగు చర్యలు తీసుకోవాలని వారు జిల్లా అధికారులను కోరారు…మరియు ఇలాంటి సంఘటనలు పునరుద్ధం కాకుండా తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ గా రాష్ట్ర ప్రభుత్వానికి వారు డిమాండ్ చేస్తు లేనియెడల ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి వారు హేచ్చరించారు…