రాజధానిపై జగన్‌ విమర్శలు హాస్యాస్పదం

– మరో రెండు నెలల్లో రాజధాని నిర్మాణ పురోగతిని ప్రజలకు చూపిస్తాం
– అమరావతిలో 25వేల కోట్లతో 1600 కి.విూ రోడ్లు నిర్మిస్తున్నాం
– మంత్రి నారాయణ
అమరావతి, జులై4(జ‌నం సాక్షి ) : మరో రెండు నెలల్లో రాజధాని నిర్మాణ పురోగతిని ప్రజలకు చూపిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. బుధవారం రాజధాని ప్రాంతంలో రోడ్లు, క్వార్టర్ల నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి రాజధాని నిర్మాణాలు చూపిస్తామని చెప్పారు. అమరావతిలో 25వేల కోట్లతో 1600 కి.విూ మేర రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. అన్ని రోడ్లను 2019 మార్చి నాటికి పూర్తిచేసేలాచర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతు కూలీల కోసం రాజధానిలో 7వేల గృహాలు నిర్మిస్తున్నామని మంత్రి అన్నారు. డిసెంబర్‌ నాటికి లబ్ధిదారులకు 5 వేల గృహాలు అందిస్తామని పేర్కొన్నారు. రాజధానిలో ఒక్క ఇటుక కూడా పెట్టలేదన్న జగన్‌ విమర్శలు హాస్యాస్పదమని అన్నారు. అత్యాధునిక షీర్‌వాల్‌ టెక్నాలజీతో ఇటుకలు ఉపయోగించామన్న విషయం జగన్‌ తెలసుకోవాలని నారాయణ సూచించారు. ప్రతిపక్షాలు అమరావతికి వచ్చి చూస్తే అభివృద్ధి
కనపడుతుందని మంత్రి నారాయణ అన్నారు.