రాజధాని గ్రామాల్లో సోము వీర్రాజుపర్యటన
బిజెపి తీరుపై మండిపడ్డ స్థానిక రైతులు
అమరావతి,జూలై29(జనంసాక్షి ): బీజేపీ ఆలోచన అభివృద్ధి మాత్రమేనని బీజేపీ నేత సోమువీర్రాజు ప్రకటించారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు మాజీప్రధాని వాజ్‌పేయితో ఉన్నట్లుగా.. ప్రధాని మోదీతో కలిసి ఉంటే రాజధాని పూర్తయ్యేదని తెలిపారు. మోదీతో చంద్రబాబు ఉంటే వైసీపీకి 150 సీట్లు వచ్చేవి కాదని పేర్కొన్నారు. బీజేపీకి అధికారం ఇస్తే రెండేళ్లలో రాజధాని నిర్మిస్తామని ప్రకటించారు. సీఎం జగన్ , చంద్రబాబు తీరుతో రాజధాని రైతులు నష్టపోయారని సోమువీర్రాజు దుయ్యబట్టారు. అంతకుముందు రాజధాని గ్రామాల్లో సోమువీర్రాజుకు చేదు అనుభవం ఎదురైంది. రాజధాని గ్రామాల్లో సోమువీర్రాజు పర్యటించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. బీజేపీకి అధికారం ఇస్తే ఏడాదిలో రాజధాని నిర్మిస్తామని వీర్రాజు చెప్పారు. దీనిపై పెనుమాకకు చెందిన రైతు కోటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్, విూరు తోడుదొంగలై రాజధానిని నాశనం చేశారని రైతు శాపనార్థాలు పెట్టారు. సోమువీర్రాజుతో కోటేశ్వరరావు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ‘రాజధానిని కట్టని ఆయనను వదిలి మావిూద పడితే ఎలా‘ అని సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నిరసనతో
సోమువీర్రాజు ఖంగుతిన్నారు. రాజధాని గ్రామాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజుకు చేదు అనుభవం ఎదురైంది. రాజధాని గ్రామాల్లో పర్యటినస్తున్న సోమువీర్రాజు… అక్కడి రైతులతో మాట్లాడారు. బీజేపీకి అధికారం ఇస్తే ఏడాదిలో రాజధాని నిర్మిస్తామంటూ బీజేపీ చీఫ్ చెప్పగా… దీనిపై పెనుమాకకు చెందిన రైతు కోటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్, విూరు తోడుదొంగలై రాజధానిని నాశనం చేశారని రైతు శాపనార్థాలు పెట్టారు. సోమువీర్రాజుతో రైతు బొప్పన కోటేశ్వరరావు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ‘రాజధానిని కట్టని ఆయనను వదిలి మావిూద పడితే ఎలా‘ అని సోమువీర్రాజు అన్నారు. రైతుల నిరసనతో సోమువీర్రాజు ఖంగుతిన్నారు.