రాజధాని ఢల్లీిలో భారీ వర్షం


రోడ్లు జలమయంతో ట్రాఫిక్‌కు అంతరాయం
న్యూఢల్లీి,ఆగస్ట్‌21(జనంసాక్షి): దేశ రాజధాని ఢల్లీిలో శనివారం ఉదయం రికార్డు స్థాయిలో భారీగా వర్షం కురిసింది. దీంతో వీధులు, రోడ్లు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఢల్లీిలో శనివారం ఉదయం 139 మిల్లీవిూటర్ల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. 13 ఏండ్లలో ఆగస్ట్‌ నెలలో ఒక రోజు అత్యధిక వర్షపాతం ఇదేనని పేర్కొంది. భారీ వర్షం నేపథ్యంలో ఢల్లీికి ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేసింది. మరో రెండు రోజులపాటు ఉరుములతో కూడిన మధ్యస్థాయి నుంచి భారీగా వర్షాలు కురుస్తాయని వెల్లడిరచింది. ఢల్లీితోపాటు నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌) లోని ప్రజలు శనివారం ఉదయం వర్షపు జల్లులతో మేల్కొన్నారు. రోజుల తరబడి ఉన్న ఉక్కపోత, తేమతో కూడిన వాతావరణం నుంచి ఉపశమనం పొందారు.