రాజస్థాన్ రాజసం
ముంబై: ఉత్యంఠంగా జరిగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ పూణే వారియర్స్ పై విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పూణె వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి178 పరుగులు చేసింది. పూణె వారియర్స్ బ్యాటింగ్‌లో ఉతప్ప 54 పరుగులు ఫించ్ 45 పరుగులు, మార్ష్ 35 పరుగులు చేశారు. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఆచితూచి అడుతూ 19.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటింగ్‌లో ద్రావిడ్ 58 రహనె 67 పరుగులతో శుభారంబాన్ని అందించారు. బిన్నీ 12 బంతుల్లో 32 పరుగులు చేసి లాంచనాన్ని పూర్తి చేశాడు. మ్యాన్ అఫ్ ది మ్యాచ్‌గా రహానె దక్కించుకున్నాడు. యువరాజ్‌సింగ్ మరోసారి ప్రేక్షకుల్ని నిరాశ పర్చాడు.