రాజీనామాలు ఆమోదించండి

లోక్‌సభ స్పీకర్‌ను కలిసి విన్నవించిన వైకాపా ఎంపీలు

మరోసారి ఆలోచించుకోవాలని స్పీకర్‌ సూచన

రాజీనామాలపై పునరాలోచన లేదు

లోక్‌సభ స్పీకర్‌కు తేల్చిచెప్పిన వైకాపా ఎంపీలు

దృవీకరణ లేఖలు కోరిన స్పీకర్‌

నేడు ఆమోదం పొందే అవకాశం

న్యూఢిల్లీ, జూన్‌6(జ‌నం సాక్షి) : తాము ఏప్రిల్‌లో అందించిన రాజీనామాలను వెంటనే ఆమోదించాలని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రామహజన్‌ను బుధవారం వైసీపీ ఎంపీలు కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ రాజీనామాల విషయంపై పునరాలోచించాలని సూచించారు. దీంతో స్పందించిన వైకాపా ఎంపీలు మాట్లాడుతూ.. రాజీనామాల విషయంపై పునరాలోచన లేదని తేల్చి చెప్పారు. ప్రత్యేక ¬దా ఇవ్వనందుకు తాము రాజీనామాలు చేశామని, ఏప్రిల్‌ చేసిన రాజీనామాలు ఇప్పటికీ ఆమోదం లభించలేదన్నారు. వెంటనే వాటిని ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు. ఈ సందర్భంగా వైకాపా ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, అవినాశ్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డిలు విూడియాతో మాట్లాడుతూ.. తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. రాజీనామాలపై స్పీకర్‌ తమ అభిప్రాయం అడగ్గా.. దీనిపై పునరాలోచించుకునేది లేదని, రాజీనామాలను వెంటనే ఆమోదించాలని కోరినట్లు తెలిపారు. దీనిపై స్పీకర్‌ స్పందిస్తూ రాజీనామాలను ధ్రువీకరిస్తూ మరోసారి లేఖ ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ధ్రువీకరణ లేఖలు ఇచ్చిన వెంటనే స్పీకర్‌ తమ రాజీనామాలను ఆమోదిస్తారని వారు వెల్లడించారు. ప్రత్యేక ¬దా కోసం చివరి వరకు పోరాడేది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటేనని ఎంపీలు అన్నారు. రాజీనామాలు ఆమోదం పొందాక ప్రజల్లోకి వెళ్లి తమ పోరాటంపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజాక్షేత్రంలో తెలుగుదేశం ప్రభుత్వ వైఖరిని ఎండగడతామన్నారు. ప్రత్యేక ¬దా సాధించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌ను కోరినట్లు తెలిపారు. మరోవైపు రాజీనామాల ఆమోదంపై గురువారం అధికారికంగా ప్రకటన విడుదలయ్యే అవకాశాలున్నాయి. పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎంపీలు ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత, బుట్టా రేణుకలపై గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదుపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా లోక్‌సభ స్పీకర్‌ను వైఎస్సార్‌సీపీ ఎంపీలు కోరారు.