రాజేంద్రనగర్‌లో హోంమంత్రి పర్యటన
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండల పరిధిలో పలు గ్రామాల్లో రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. మండలం పరిధిలోని 14 గ్రామాల్లో రూ.6 కోట్లతో చేపట్టిన 43 అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాను అన్ని విధాలుగా అభివృద్థి పరిచేందుకు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ఇందిరమ్మబాటలో భాగంగా ముఖ్యమంత్రి వచ్చేనెల 3,4,5 తేదీల్లో మూడు రోజుల పాటు జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారన్నారు. ప్రధానంగా రాజేంద్రనగర్ మండల పరిధిలో ఇందిరమ్మ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు మంత్రి తెలియజేశారు.