రాజ్యసభకు టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవం!?

5

– రెండే నామినేషన్లు

– రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తాం

– కెప్టెన్‌, డీఎస్‌

హైదరాబాద్‌ ,మే31(జనంసాక్షి):రాజ్యసభ స్థానాలకు నామినేషన్ల దాఖలుకు మంగళవారం సాయంత్రం గడువు ముగిసింది. టీఆర్‌ఎస్‌ నుంచి డి. శ్రీనివాస్‌, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు నామినేషన్లు దాఖలు చేశారు. ఇతర పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు కాలేదు. రాజ్యసభ సభ్యులుగా డీఎస్‌, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.జూన్‌ 1న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 3న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు. 11న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగును. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. 13న ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కో స్థానానికి ఒక్కో అభ్యర్ధి మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో దాదాపు అన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశముంది.

రాష్ట్ర అభివృద్దికి కృసి చేస్తాం

రాష్ట్ర ప్రయోజనాల కోసం పూర్తి స్థాయిలో పోరాడుతానని రాజ్యసభ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు. రాజ్యసభ అభ్యర్థిత్వానికి నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు విూడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ చేపడుతున్న పథకాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. బంగారు తెలంగాణ కోసం సీఎం సారథ్యంలో పని చేస్తానని ఉద్ఘాటించారు. తనవంతుగా ప్రతి విసయంలో కెసిఆర్‌ వెన్నంటి ఉంటానని అన్నారు. ఢిల్లీ పెద్దలతో ఉన్న పరిచయాలతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని రాజ్యసభ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డి. శ్రీనివాస్‌ పేర్కొన్నారు. రాజ్యసభ అభ్యర్థిత్వానికి నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం డీఎస్‌ విూడియాతో మాట్లాడారు. రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌ కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు బ్రహ్మాండమైన విజన్‌ ఉందని కొనియాడారు. బంగారు తెలంగాణెళి లక్ష్యంగా సీఎం పని చేస్తున్నారని తెలిపారు. బంగారు తెలంగాణకు తాను సైతం కేసీఆర్‌ సారథ్యంలో పని చేస్తానని స్పష్టం చేశారు. సీఎంకు అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు. సాగు, తాగు నీటి కోసం బృహత్తరమైన ప్రణాళికలు సిద్ధం చేశారని పేర్కొన్నారు.