రానున్న ఎన్నికల్లో బీజేపీదే గెలుపు : మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన గెలుపొంది అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని మాజీ ఎంపీ , బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.జిల్లా కేంద్రంలో జరిగిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.దుబ్బాక, హుజురా బాద్ లో కార్యకర్తల కృషితోనే బీజేపీ విజయం సాధించిందని అన్నారు.తెలంగాణలో బీజేపీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని , నీళ్లు, నిధులు నియామకాలు వస్తాయని కలలు కన్న ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. రూ.12వేల కోట్ల మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రాంగా మార్చారని విమర్శించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ న్యాయకత్వంలో తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుందని చెప్పారు.పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బీజేపీ సభను ప్రజలే సక్సెస్ చేశారని గుర్తు చేశారు. క్లౌడ్ బ్లాస్టర్, విదేశీ కుట్ర అంటున్న సీఎం కేసీఆర్ , అది ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కేంద్రం నిధులు ఇస్తుందని అన్నారు.ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి , నాయకులు కడియం  రామచంద్రయ్య , పాల్వాయి రజనీ, సలిగంటి వీరేంద్ర , సాయిబాబా , ఎండీ అబిద్,  మల్సూర్ గౌడ్ , చలమల్ల నరసింహ తదితరులు పాల్గొన్నారు.