రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు
విశాఖపట్నం: రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయువ్వ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఒడిశా-గ్యాంగ్‌టక్, పశ్చిమ బెంగాల్ తీరానికి ఆనుకుని స్థిరంగా కొనసాడుతోంది. దీనికి తోడు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి బలపడింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావం వల్ల కోస్తాంధ్ర, తెలంగాణల్లో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. కోస్తాంధ్ర తీరం వెంబడి పశ్చిమ దిశ నుంచి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. దీని వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. సముద్రంలోరి వేటకు వెళ్లే మత్స్యకారులు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడితే రాష్ట్రంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.