రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే:దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

తెలంగాణలో కాంగ్రెస్ తోనే సుస్థిర పాలన.

– ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త మేమే ఎమ్మెల్యే అభ్యర్థులమని పనిచేయాలి.

– రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం.

దౌల్తాబాద్ అక్టోబర్ 28, (జనం సాక్షి )

 

దౌల్తాబాద్ మండల కేంద్రంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలో వివేకానంద చౌరస్తా నుండి ఎస్ వి ఫంక్షన్ హాల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎస్ వి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన దౌల్తాబాద్, చేగుంట, రాయపోల్,నార్సింగ్ మండలాలకు చెందిన ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అప్పుల తెలంగాణ మార్చిన ఘనత బీఆర్‌ఎస్‌ పార్టీకే దక్కుతుందని ఎద్దెవా చేశారు. ఎన్నో ఎండ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న భూములకు ధరణి పేరుతో పట్టాలివ్వకుండా రైతుల హక్కులను కాలరాశారన్నారు. ధోరల కోసమే కేసీఆర్‌ ధరణిని తీసుకొచ్చి, పేదల భూములను లాక్కుంటున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ హాయాంలో 58 వేల మెగా డీఎస్‌సీ వేసి, ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు.
కాంగ్రెస్‌ పాలనలో భూమిలిచ్చామని, ఇండ్లు ఇచ్చామన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌ పాలన కొనసాగిందన్నారు. రెసిడెన్షియల్ కాలేజీలు . రెసిడెన్షియల్ స్కూల్ , బ్రిడ్జిలు, సిసి రోడ్లు, సబ్ స్టేషన్లు, తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. మండలానికొక రెసిడెన్షియల్, పాలిటేక్నిక్‌ కళాశాలలను తీసుకొచ్చామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో
రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకు లింకు రోడ్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రజల త్యాగాలను గుర్తించి కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను ఇచ్చిందన్నారు. అభివృద్ది, సంక్షేమం, మానవత్వం, సిద్దాంతాలకు కట్టుబడి కాంగ్రెస్‌ పార్టీ పనిచేసిందన్నారు.
ఏ నాయకుడికైనా తన ప్రాంతాభివృద్దిపై మమకారం, తపన ఉండాలే తప్ప, ప్రజలకు అబద్దాలు బిఆర్ఎస్ చెప్పి మోసం చేయడం కరెక్ట్ కాదన్నారు . ఎన్నికలంటే పండుగ కాదని, మీ పిల్లల భవిష్యత్‌ అని అయన అన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలు, హమీలకు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలి అన్నారు. సుస్థిర పాలన అందించడం ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలను మోసం చేసిన బిఆర్ఎస్ పార్టీని గద్దె దింపాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు పథకాలతో అన్ని వర్గాల ప్రజలు, మహిళలు,రైతులు, నిరుద్యోగులకు మేలు జరుగుతుందన్నారు. .ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్, రాయపోల్, చేగుంట, నార్సింగ్ మండలాల అధ్యక్షులు పడాల రాములు, సుధాకర్,వడ్ల నవీన్, శ్రీనివాస్ గౌడ్,మాజీ సర్పంచ్ లు ఆది వేణుగోపాల్,భద్రయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండారు లాలు, గొల్లపల్లి కనకయ్య, మల్లారెడ్డి, మల్లేశం, ఆంజనేయులు గౌడ్,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.