రామగుండం ఎన్టీపీసీ 7వ యూనిట్‌లో సాంకేతికలోపం

గోదావరిఖని: కరీంనగర్‌జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ 7వ యూనిట్‌ సాంకేతిక లోపంతో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో 500మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు లోపాన్ని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. సాధ్యమైనంతా త్వరగా మళ్లీ విద్యుదుత్పత్తిని పున:ప్రారంభిస్తామని వారు తెలిపారు.