రామప్పతో పర్యాటకానికి మహర్దశ
ప్రాజెక్టులతో మారుతున్న తెలంగాణ దశ
వరంగల్,ఆగస్ట్16(జనంసాక్షి): జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా అనేక మంది దేశ, విదేశ పర్యాటకుల దృష్టి పడి వారి సందర్శనతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. రామప్పకు యునెస్కో గుర్తిపుతో యువతకు పర్యాకట రంగంలో ఉపాధి దక్కుఉందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో పలు పర్యాటక ప్రాంతాలకు మంజూరు చేసిన పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ఇకపోతే ప్రభుత్వం ఆస్పత్రులకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించి, అవసరమైన సాంకేతిక పరికరాలు అందించి సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషిచేస్తోందన్నారు. సర్కార్ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెరిగేందుకు తల్లీబిడ్డల సంరక్షణకు ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం కింద జిల్లాలో ప్రసూతి పొందిన స్త్రీలకు 15 రకాల వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్‌తో పాటు ఆడపిల్ల పుడితే 13వేలు, మగపిల్లవాడయితే రూ.12వేల అందిస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే ప్రాజెక్టుల నిర్మాణం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలవుతుందని కెసిఆర్ నిరూపించారని అన్నారు. కాంగ్రెస్ పదేళ్ల కాలంలో చేయలేని పనులను సిఎం కెసిఆర్ నాలుగేళ్ల కాలంలోనే చేసి చూపారని అన్నారు. ఇది జీర్ణించుకోలేక విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. బంగారు తెలంగాణ ప్రాజెక్టులతోనే సాధ్యమవుతుందన్న దృష్టితో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ బంగారు తెలంగాణగా మార్చాలన్న ఉద్దేశంతో ప్రాజెక్టులకు పునర్జీవనం పోస్తున్నారని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ పూర్తయితే నాలుగు జిల్లాలకు తాగునీరందుతుందని వెల్లడిరచారు. తెలంగాణలోని 31 జిల్లాలు సస్యశ్యామలంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని అన్నారు.