రామప్పను సందర్శించిన రష్యన్ దంపతు
జయశంకర్ భూపాలపల్లి,నవంబర్27(జనంసాక్షి): వెంకటాపురం మండలంలోని పాలంపేటలో ఉన్న ప్రసిద్ద రామప్ప దేవాలయాన్ని రష్యా దేశస్థులు వాల్డిమోర్ దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శిల్పకళా సంపదను కనులారా వీక్షించి తమ కెమెరాల్లో బంధించుకున్నారు. అదే విధంగా ఆలయ విశిష్టత గురించి గైడ్‌లు విజయ్‌కుమార్, వెంకటేష్ ద్వారా తెలుసుకుని అబ్బురపడ్డారు. అక్కడి నుంచి సరస్సు వద్దకు చేరుకుని బోటు షికారు చేస్తూ ప్రకృతి అందాలను తిలకించారు. ఇంతటి ప్రకృతి సంపదను తిలకించడం ఆనందంగా ఉందన్నారు.