రాయితీపై వికలాంగులకు బస్ పాసులు కొరకు దరఖాస్తులు స్వీకరణ
* ఆర్టీసీ డిపో బస్ పాస్ కోఆర్డినేటర్ దేవేందేర్,
ఖానాపురం ఆగష్టు 26జనం సాక్షి
రాయితీపై వికలాంగులకు బస్ పాస్ ల కొరకు దరఖాస్తులు స్వీకరించినట్లు ధర్మ రావు పేట గ్రామ సర్పంచ్ శృతి పూర్ణచందర్, ఆర్టీసీ డిపో బస్ పాస్ కో ఆర్డినేటర్ దేవేందర్ తెలిపారు. శుక్రవారం మండలంలోని ధర్మపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ శృతి పూర్ణచందర్ ఆధ్వర్యంలో 25 మంది వికలాంగుల నుండి దరఖాస్తులు స్వీకరించి నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో బస్ పాస్ కో ఆర్డినేటర్ దేవేందర్ మాట్లాడుతూ నర్సంపేట డిపో మేనేజర్ బాలునాయక్ ఆదేశాల మేరకు నేడు మనుబోతుల గడ్డ గ్రామంలో వికలాంగుల బస్సు పాస్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ. క్యాంపుకు హాజరయ్యేవారు ఆధార్ కార్డు జిరాక్స్, సదరం సర్టిఫికెట్ జిరాక్స్, పాస్ ఫోటో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. వీరికి సోమవారం రోజున బస్ పాసులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్నిదివ్యంగుల ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దివ్యంగుల అధ్యక్షుడు రాములు, కారోబార్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.