రావత్‌కే సభ విశ్వాసం

1

– సుప్రీంకు నివేదిక

– నేడు ఫలితం వెల్లడించనున్న కోర్టు

డెహ్రాడూన్‌,మే10(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు నిర్వహించిన బల పరీక్ష పక్రియ ముగిసింది. 70 మంది ఎమ్మెల్యేలున్న శాసనసభలో 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో 61 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఈ పక్రియలో పాల్గొన్నారు.సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విశ్వాసపరీక్ష జరిగింది. అయితే అసెంబ్లీలో బలాబలాల నేపథ్యంలో రావత్‌ గ్టెక్కినట్లు సమాచారం. ఆయనకు బిఎస్పీ మద్దతు ఇవ్వడంతో 31మంది ఎమ్మెల్యేల మద్దుత దక్కినట్లు సమాచారం. బిజెపికి 28మంది ఎమ్మెల్యేల మద్దతుఉంది.  ఓటింగ్‌ వివరాలను సీల్డ్‌ కవర్‌లో ఉంచారు. సుప్రీంకోర్టు ఆ ఫలితాలను బుధవారం వెల్లడించనుంది.  బలపరీక్ష వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం సుప్రీంకోర్టు సమర్పించనున్నారు. బలపరీక్ష నేపథ్యంలో శాసనసభ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. బలపరీక్షలో హరీశ్‌రావత్‌ గెలవాలంటే.. 31 ఎమ్మెల్యేల మెజార్జీ రావాలి. అయితే స్పీకర్‌తో కలిసి కాంగ్రెస్‌కు 27 మంది సభ్యులున్నారు. బీఎస్పీ నుంచి ఇద్దరు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా రావత్‌కు తమ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.  విశ్వాసపరీక్షను ఎదుర్కొనేందుకు ఆ రాష్ట్ర మాజీ సీఎం హరీశ్‌ రావత్‌  ఉదయమే అసెంబ్లీ చేరుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీకే మద్దతు ఇస్తున్నట్లు విశ్వాసపరీక్షకు ముందు బీఎస్పీ నేతలు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రేఖా ఆర్యా బీజేపీ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. విశ్వాస

పరీక్షలో తమకు 34 ఓట్లు వచ్చినట్లు కాంగ్రెస్‌ పేర్కొంది. ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. పీడీఎఫ్‌ సభ్యులు తమ ఆరు ఓట్లను కాంగ్రెస్‌ కే వేసినట్లు చెప్పారు. ఉత్తరాఖండ్‌ ప్రజలకు హరీశ్‌ రావత్‌ అభినందనలు తెలిపారు. సుప్రీం ప్రకటన కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పారు. శాసనసభ నుంచి బయటకు రాగానే హరీశ్‌ రావత్‌ విక్టరీ సంకేతం చూపించారు. సుప్రీంకోర్టు, ప్రజాస్వామ్య శక్తులు, రాష్ట్ర ప్రజలు, దేవతలకు హరీశ్‌ థ్యాంక్స్‌ తెలిపారు. అనిశ్చితి మేఘాలు తొలిగిపోనున్నట్లు ఆయన తెలిపారు. తొమ్మిది మంది రెబల్‌ ఎమ్మెల్యేలకు విశ్వాసపరీక్షలో పాల్గొనే ఛాన్సు లేదని ఆ రాష్ట్ర హై కోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో రావత్‌కు అవకాశం కలసి వచ్చింది.  విశ్వాసపరీక్ష సందర్భంగా సుమారు రెండు గంటల పాటు రాష్ట్రపతి పాలనను ఎత్తేశారు. అసెంబ్లీలో జరిగిన సభ వ్యవహారాలను వీడియోలో చిత్రీకరించారు. సుప్రీంకోర్టుకు బలపరీక్ష వివరాలను పంపేందుకు ఆ వ్యవహారాన్ని వీడియోలో షూట్‌ చేశారు.  ప్రతిపక్ష బీజేపీ వద్ద కూడా 28 మంది సభ్యులు ఉన్నారు. దాంతో విశ్వాస పరీక్ష ఆసక్తికరంగా మారింది. ఉత్తరాఖండ్‌లో ప్రజాస్వామ్యం గెలిచిందని కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఇది సాధ్యమైందన్నారు. కోర్టు తీర్పు వల్ల సభలో విశ్వాస పరీక్ష సాధ్యమైందని పేర్కొన్నారు.  ఉత్తరాఖండ్‌లో హరీష్‌రావత్‌ బలనిరూపణ పరీక్ష జరిగిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు బీజేపీ సర్కారు కుట్ర పన్నిందని వివరించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి ఈ చర్యను మొదలుపెట్టిందని విమర్శించారు. కాగా, ఇవాళ ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో సుప్రీం ఆదేశాల మేరకు విశ్వాస పరీక్ష జరిగింది. కోర్టుల జోక్యం వ్‌ల్లనే ప్రజాస్వామ్యం మనుగడ సాగించేలా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడం ద్వారా అప్రతిష్ట తెచ్చారని అన్నారు.