రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ
కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయం
న్యూఢిల్లీ : రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ బరిలో దిగనున్నారు. దేశరాజధానిలో గురువారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ అభ్యర్థితత్వాన్ని సమావేశం ఖరారు చేసింది. ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్రమంత్రులు ప్రణబ్‌ముఖర్జీ, ఆంటోనీ తోపాటు వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై చర్చ సాగింది. మెజార్టీ సభ్యులు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న కోర్ కమిటీ ప్రణబ్ అభ్యర్థిత్వం ఖరారుకు మొగ్గు చూపింది. దీంతో ప్రణబ్ అభ్యర్థిత్వం ఖరారైనట్టయింది.