రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము ఘన విజయంతో బిజెపి సంబరాలు
* ముస్లిం, దళిత, గిరిజనులను రాష్ట్రపతి చేసిన ఘనత బిజెపి దే
* జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్
కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) :
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపతి ముర్ము ఘన విజయం పట్ల బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో భారీ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ చౌక్లో టపాసులు పేల్చి ,స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో బిజెపి ( ఎన్ డి ఏ ప్రభుత్వం ) అధికారంలో ఉన్న సమయాల్లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో అబ్దుల్ కలాం ( ముస్లిం ), రామ్నాథ్ కోవింద్ ( దళిత ) , నేడు గిరిజన మహిళ ద్రౌపతి ముర్ము లకు అవకాశం కల్పించి ఆయా వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వడంతో వారందరూ అత్యున్నత రాష్ట్రపతి పదవి చేపట్టారన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం
“సబ్ కా సాత్ .. సబ్ కా వికాస్..సబ్ కా విశ్వాస్.. సబ్ కా ప్రయాస్ లక్ష్యంగా అడుగులు వేస్తూ ప్రధమంగా గిరిజన మహిళ ద్రౌపతి ముర్ము కు రాష్ట్రపతి అభ్యర్థి అవకాశం కల్పించి, భారత దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టిందన్నారు. ద్రౌపతి
ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి కేంద్రంలోని మోడీ బిజెపి ప్రభుత్వం గిరిజనులకు పెద్దపీట వేసిందని , ముఖ్యంగా ద్రౌపతి ముర్ము గిరిజన మహిళ రాష్ట్రపతి పదవి చేపట్టడం ఆ జాతికే గర్వకారణం లాంటిద న్నారు. రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వానికి గిరిజన ప్రజల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉందో రాష్ట్రపతి ఎన్నికల్లో స్పష్టమైందన్నారు. గిరిజన మహిళ ద్రౌపదీ ముర్ము కి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వకుండా, గిరిజనులు చిన్నచూపు చూసి స్వార్థ రాజకీయాల కోసం ప్రయత్నం చేసిందని దుయ్యబట్టారు . గిరిజనుల పట్ల కెసిఆర్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో రాష్ట్రపతి ఎన్నికలతో అర్థమైందని, గిరిజన సమాజం కూడా కెసిఆర్ వ్యవహార శైలిని గమనించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సాయిని మల్లేశం, మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయ శ్రీ, ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షులు కట్ట రాజు , శ్రీకాంత్ నాయక్, లక్ష్మణ్ ,మంజులవాని, కటకం లోకేష్ , బో0తల కళ్యాణ్ చంద్ర , దురిశెట్టి సంపత్, , జనపట్ల స్వామి,జాడి బల్ రెడ్డి, అన్నం ప్రకాష్ ,మంతిని కిరణ్, పుప్పాల రఘు జోన్ అధ్యక్షులు రతన్, అవదుర్తి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తణుకు సాయి కృష్ణ, పొన్నం మొండయ్య , శ్రీనివాస్, దేవి శెట్టి నవీన్, సుధాకర్, శ్రీధర్, మల్లేశం, మునిగంటి కుమార్, ఏనుగుల అనిల్,మోహన్ ,ప్రసాద్, రమేష్,కలికోట మోహన్, అసీం, అక్షయ్ , ఆనంద్, శ్రీనివాస్, సత్యనారాయణ అభిలాష్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.