రాష్ట్రపతి ఎన్నికలకు దూరం: టి.డి.పి నిర్ణయం
హైదరాబాద్, జూలై17: రాష్ట్రలతి ఎన్నికల్లో ఓటింగ్ కు దూరంగా ఉండాలని పిటిడిపి నిర్ణయించింది. మమతా బెనర్జీ ఓకే చెప్పడంతో బాబు నో చెప్పడం విశేషం. అయితే తెలంగాణ నేతల ఒత్తిడికి తలొగ్గిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించారని సమాచారం. తెలంగాణ వ్యతిరేకిగా ప్రణబ్ ముఖర్జీని భావిస్తూ మతతత్వ బిజెపి మద్దతిస్తున్న పిఎ సంగ్మాను బలపరచలేక రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయకూడదని తెలుగుతేశం పార్టీ నిర్ణయించుకుందని సమాచారం అందించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్ మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాష్ట్రతి ఎన్నికల్లో కాగ్రెసు నేతృత్వంలోని యుపిఎ అఢ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయనున్నట్లు చంద్రబాబు ఇంతకు ముందు సంకేతాలు ఇచ్చారు. అయితే, తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించిన ప్రణబ్ ముఖర్జీని బలపరచకూడదంటూ తెలుగురేశం తెలంగాణ ఫోరం నేతలు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ప్రణబ్ ముఖర్జీని తెలంగాణ వ్యతిరేకిగా పరిగణిస్తూ ఆయనకు ఓటు వేయకూడదని వారు సూచించారు. వారి విజ్ఞప్తికి చంద్రబాబు తలొగ్గినట్లు చెబుతున్నారు. ప్రణబ్ ముఖర్జీని తెలంగాణ ద్రోహిగా పరిగణిస్నున్నామని రమేష్ రాథోడ్ ఇప్పటికే చెప్పారు. అలాగే, మతతత్వ బిజెపి సమర్థిస్తున్న పిఎ సంగ్మాకు కూడా ఓటు మయకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుందన్నారు. దీంతో రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని తమ పార్టీ నిర్ణయించుకుందన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ ఓటర్లెవరూ పాల్గొనబోరని రమేష్ రాథోడ్ చెప్పారు. వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రణబ్ ముఖర్జీకి ఓటేసే అవకాశాలే ఎకుకవగా ఉన్నాయి, అయితే, ఆ పార్టీ తన వైఖరిని ఇప్పటివరకు ప్రకటించలేదు. అలాగే, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇవ్వకూడదని తెలంగాణ జెఎసి తెలంగాణ పర్టీలను, ప్రజా ప్రతినిధులను కోరింది. మొత్తానికి టిడిపి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టిఆర్‌ఎస్‌కు ఇరకాటం కానుంది.