రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున గృహాలు ప్రారంభం
పలు చోట్ల పాల్గొన్న మంత్రులు
అమరావతి,జూలై5(జనం సాక్షి): ఎపిలోని వివిధ ప్రాంతాల్లో గురువారం పెద్ద ఎత్తున గృహప్రవేశాలు, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు జరిగాయి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాని మండల కేంద్రంలో ఎన్టీఆర్ గృహ ప్రవేశ మ¬త్సవం గురువారం నిర్వహించారు. దేశంలోనే మొట్టమొదటిసారి 3 లక్షల ఇళ్లు గృహ ప్రవేశం చేయడం ఇదే ప్రథమమని పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. ఎన్టీ రామారావు కలలు సాకారం చేయడంలో సిఎం చంద్రబాబు ఎన్టీఆర్ గృహ ప్రవేశాలు నిదర్శనమన్నారు. పేదలకు ఇళ్లుఏ నిర్మించి ఇవ్వడం ఇంతపెద్ద మొత్తంలో జరగడం ఇదే ప్రథమమని అన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద పంజాని ఎంపిడిఒ కార్యాలయ శంకుస్థాపన చేపట్టారు. అమరనాథరెడ్డి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో గురువారం ఎన్టీఆర్ నూతన గృహ ప్రవేశాల ప్రారంభోత్సవం నిర్వహించారు. డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభోత్సవం చేశారు. అనంతరం పెద్దాపురం నియోజకవర్గంలో 1374 డబల్ బెడ్ గృహాలను ప్రారంభోత్సవం చేసి లబ్దిదారులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్తికేయ మిశ్రా, పెద్దాపురం మునిసిపల్ ఛైర్మన్ సూరిబాబురాజులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 37 వేల ఎన్టీఆర్ గఅహాలు ప్రారంభమయ్యాయని చినరాజప్ప తెలిపారు.పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలో గురువారం ఎంఎల్ పీతల సుజాత ఎన్టీఆర్ నూతన గృహాల శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ…ఎన్టీఆర్ గృహాలు కొత్తగా 2,180 మంజురు అయినట్లు తెలిపారు. కార్పొరేటు స్కూల్‌కి ధీటుగా ప్రభుత్వ పాఠాశాలలను తీర్చిదిద్దడానికి టిడిపి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.