రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ బలంగా ఉంది: నారాయణ

నల్గొండ: ప్రత్యేక తెలంగాణ నినాదం కారణంగా సీపీఐ బలహీనపడిపోయిందన్న వాదనలో పసలేదని. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణతోపాటు రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని ఆయన సూర్యాపేటలో వెల్లడించారు. ప్రజలే నేతలకు అడ్డుపడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటారని అన్నారు. రాష్ట్రంలో ఎవరి భావాలు వారివేనని ప్రత్యేక రాయలసీమ డిమాండ్‌ను తప్పుబట్టలేమని నారాయణ వ్యాఖ్యానించారు.