రాష్ట్రస్థాయి మెకానిక్స్ కార్యశాలలో పాల్గొన్న ఉపాధ్యాయులు

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): విజ్ఞాన తెలంగాణ , విజ్ఞాన భారతి నేతృత్వంలో ములుగులో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యశాలలో బాలెంల,  కందగట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు  గోళ్ళమూడి రమేష్ బాబు మరియు వనమాల శ్రీనివాస్ పాల్గొన్నారు.శిక్షా శిల్పి జాతీయ సమన్వయకర్త డాక్టర్ అజయ్ మహాజన్, రామనాథం,జీఎల్ఎన్ మూర్తి రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించి ప్రయోగాల ద్వారా భౌతిక శాస్త్రంలోని మెకానిక్స్ అంశాలను విశదీకరించారు.ప్రపంచ ప్రఖ్యాతి చెంది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంను సందర్శించి, ఆలయంలో దాగివున్న భౌతిక శాస్త్ర నియమాలను,  సూత్రాలను, కట్టడంలో  వినియోగించిన అత్యంత తేలికైన నీటిలో తేలియాడే ఇటుకల గురించిన గొప్పతనాన్ని, ఆనాటి ఇంజనీరింగ్  శిల్పకళా నైపుణ్యతను తెలుసుకున్న ఉపాధ్యాయులను డీఈఓ అశోక్, సెక్టోరియల్ అధికారులు  కందిబండ శ్రవణ్ కుమార్ ,  ఎర్రంశెట్టి రాంబాబు  అభినందించారు.
 ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రతిఏటా నిర్వహించే *విద్యార్థి విజ్ఞాన మంథన్ (VVM)* పరీక్ష కరదీపికలను, గోడ పత్రికను కూడా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఆవిష్కరించారు.