రాష్ట్రానికి చల్లని కబురు

48 గంటల్లో రుతు పవనాలు
హైదరాబాద్‌/విశాఖపట్నం, జూన్‌ 2 (జనంసాక్షి) :
రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు. మరో 48 గంటల్లో రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని వారు పేర్కొన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల నుంచి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విరివిగా వర్షాలు కురుస్తాయన్నారు. వర్షాలు సాధారణంగానే కురుస్తాయన్నారు. ఆ వానలు రైతులకెంతో మేలు చేస్తాయన్నారు. అలాగే సాయంత్రం క్యుములోనింబస్‌ వల్ల రాష్ట్రంలో విరివిగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉండగా ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి నెలకొని ఉంది.