రాష్ట్రాలకు 42 శాతం వాటా

2

11 రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు

పార్లమెంటు ముందుకు ఆర్థిక సంఘం నివేదిక..అరుణ్‌జైట్లీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి24(జనంసాక్షి): దేశవ్యాప్తంగా 11 రాష్టాల్ల్రో రెవెన్యూ లోటు ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. 14వ ఆర్థిక సంఘం నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అనంతరం అరుణ్‌జైట్లీ విూడియాతో మాట్లాడారు. కేంద్ర పన్నుల్లో రాష్టాల్రకు వాటా పంచాలని ఆర్థిక సంఘం సిఫారసు చేసినట్లు తెలిపారు. పన్నులను కేంద్రం రాష్టాల్రకు పంపిణీ చేస్తుందన్నారు. రూ. 1,94,021 కోట్లు రెవెన్యూ లోటు ఉందని స్పష్టం చేశారు. అసోం, హిమాచల్‌ప్రదేశ్‌, ఆంధప్రదేశ్‌, జమ్మూ, కేరళ, మణిపూర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, త్రిపుర, పశ్చిమబెంగాల్‌లో రెవెన్యూ లోటు ఉందని పేర్కొన్నారు. రాష్టాల్రు క్రమంగా స్వయం సమృద్ధి సాధించాలన్నారు. పన్నుల్లో రాష్టాల్రకు 42 శాతం వాటా ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం సూచించింది. మరో 4 నుంచి 5 శాతం వాటా స్థానిక సంస్థల ద్వారా ఇవ్వాలని సంఘం పేర్కొంది. వచ్చే ఐదేళ్లలో ఆంధప్రదేశ్‌ రెవెన్యూ లోటు పూడ్చేందుకు కేంద్రం సాయం చేయనుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. ఆంధప్రదేశ్‌కు 2015-2020 మధ్య 22 వేల 113 కోట్ల రూపాయలు సాయం అందించనున్నట్లు ఆయన తెలిపారు. 2015-16 సంవత్సరానికి రూ. 6609 కోట్లు , 2016-17 సంవత్సరానికి రూ. 4930 కోట్లు , 2017-18 సంవత్సరానికి రూ. 4430 కోట్లు , 2018- 19 సంవత్సరానికి రూ. 3644 కోట్లు , 2019-20 సంవత్సరానికి రూ. 2499 కోట్లు చొప్పున కేంద్ర సాయం అందుతుందని జైట్లీ తెలిపారు. గతంలో ప్రకటించిన మేరకు ఈ సాయం అందించాలని నిర్ణయించినట్లు సమాచారం.14వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం రెండు రాష్టాల్ల్రోనే రెవెన్యూ మిగులు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గుజరాత్‌ రెవెన్యూ మిగులు రూ. 11వేల 795 కోట్లు కాగా, తెలంగాణ రెవెన్యూ మిగులు రూ. 818 కోట్లని ఆయన తెలిపారు. రాష్టాల్రు క్రమంగా స్వయం సమృద్ధి సాధించాలని ఆయన పేర్కొన్నారు. రాష్టాల్రు తమ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి నమూనా రూపొందించుకోవాలని, పంచాయతీ, నగర పాలక సంస్థల నిర్వహణకు నిధులు సమకూర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. అన్ని రాష్టాల్ర ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ లేఖ రాశారని, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను అంగీకరించినట్లు పేర్కొన్నారని జైట్లీ తెలిపారు. జాతీయ అభివృద్ధిలో కేంద్రానికి రాష్టాల్రు సహకరించాలన్నారు.