రాష్ట్ర ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): వచ్చే నెల 8 నుంచి 10వ తేదీ వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి టి. సాగర్ పిలుపునిచ్చారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ భవన్ లో అక్టోబర్ 16న మునగాల మండల కేంద్రంలో జరిగే సంఘ జిల్లా ద్వితీయ మహాసభ ఆహ్వాన సంఘం సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నవంబర్ 8న నల్లగొండలో రైతుల భారీ ప్రదర్శన అనంతరం బహిరంగ సభ జరుగుతుందన్నారు.ఈ సభకు జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ అశోక్ ధవలే, హనన్ మొల్ల, సహాయ కార్యదర్శి డాక్టర్ విజూ కృష్ణన్ పాల్గొంటారని చెప్పారు.రైతాంగ ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేస్తానన్న పీఎం మోడీ మాటలు ఆచరణకు నోచుకోలేదన్నారు.విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.దేశంలో రైతుల రుణాలను రద్దు చేస్తూ పార్లమెంట్ లో చట్టం తేవాలని అన్నారు.కార్పొరేట్ కంపెనీలకు లాభం చేసే పంటల బీమా పథకాన్ని సవరించాలన్నారు.లక్ష లోపు రుణాలన్నిటిని ఏకకాలంలో మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.ధరణి లో ఉన్న లోపాలను సవరించాలని కోరారు.అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన వారందరికీ పాస్ పుస్తకాలు ఇవ్వాలన్నారు.ఈ సమావేశంలో సంఘ జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు,రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి ,జిల్లా ప్రధాన కార్యదర్శి దండ వెంకట రెడ్డి ,జిల్లా ఆఫీస్ బేరర్స్ కోప్పుల రజిత,మెదరమెట్ల వెంకటేశ్వర్లు, కందళ శంకర్ రెడ్డి , పల్లే వెంకటరేడ్డి, గమ్మడివెల్లి ఉప్పలయ్య, పల్లా సుదర్శన్, మందడి రాంరెడ్డి , బెల్లంకొండ సత్యనారాయణ , దుర్గి బ్రహ్మం, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.