రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన వాల్మీకి సంఘం

వనపర్తి టౌన్ సెప్టెంబర్ 9(జనం సాక్షి) వాల్మీకి బోయలకు ఉప్పల్ భగయత్ లో ఒక ఎకరా స్థలం,నిర్మాణం కోసం కోటి రూపాయల నిధులు కేటాయించినందుకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి వాల్మీకి సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ మండల దేవన్న నాయుడు,ఉపాధ్యక్షులు కావలి బాలస్వామి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదు ఉప్పల్ భగయత్ లో వాల్మీకి ఆత్మగౌరవ భవనం కొరకు ఒక ఎకరా స్థలాన్ని,నిర్మాణం కోసం కోటి రూపాయలు కేటాయించి ప్రొసీడింగ్ అందించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు,వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి,ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు వారి సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.గతంలో 16 ఏప్రిల్ 2017 అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసిన ఎస్టి రిజర్వేషన్ బిల్లు ఆచరణా లో లేదు కాబట్టి ఇప్పుడైనా ఈనెల 12 తారీకు జరిగే అసెంబ్లీ సమావేశాలలో ఎస్టీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి అమలు చేయాలని వారు కోరారు.హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై వాల్మీకి విగ్రహం పెట్టాలని,ప్రతి జిల్లా కేంద్రంలో వాల్మీకి కమిటీ హాల్ లను నిర్మించాలని ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో బుసిరెడ్డిపల్లి స్వామి గణేష్ లు ఉన్నారు