రాష్ట్ర ప్రయోజనాల కోసమే మా పోరాటం

– విభజన హావిూల అమల్లో ఏపీని కేంద్రం మోసం చేసింది
– రైల్వేజోన్‌ వచ్చే వరకు పోరాటం ఆపం
– విభజన హావిూలు నెరవేర్చే వరకు పార్లమెంట్‌ను స్తంభింపజేస్తాం
– రైల్వేజోన్‌ కోసం ఒక్కరోజు దీక్షలో తెదేపా నేతలు
– దీక్షలో పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు
విశాఖపట్నం, జులై4(జ‌నం సాక్షి ) : విభజన హావిూల అమలు చేయకుండా కేంద్రం ఏపీని మోసం చేసిందని టీపీడీ నేతలు మండిపడ్డారు. విశాఖ రైల్వేజోన్‌ సాధన కోసం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విశాఖ రైల్వేస్టేషన్‌ సవిూపంలోని కాన్వెంట్‌ జంక్షన్‌లో బుధవారం నిరశన చేపట్టారు. ఈ దీక్షలో తెదేపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు సైతం ఈ దీక్షలో పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకు ఆర్కేబీచ్‌లోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నాయకులంతా ప్రదర్శనగా దీక్ష శిబిరం ప్రాంగణానికి చేరుకున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఎంపీ అవంతి మాట్లాడుతూ హావిూల అమలు కోసం నాలుగేళ్లు ఎదురుచూశామని, ఏ ఒక్క హావిూ అమలు చేయకుండా కేంద్రం అన్యాయం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడుతున్నామని ఎంపీ స్పష్టం చేశారు. ఎంపీలు ప్రధాని వద్దకు వెళ్తే అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలిసి రావాలని ఎంపీ అవంతి పిలుపునిచ్చారు. రైల్వేజోన్‌ కోరుకునే వారంతా టీడీపీ పోరాటానికి మద్దతివ్వాలని మంత్రి అయ్యన్నపాత్రుడు కోరారు. రైల్వేజోన్‌ వస్తే విశాఖలోనే రిక్రూట్‌మెంట్‌ జరుగుతుందని అన్నారు. కేంద్రంతో ఎన్నిసార్లు సంప్రదింపులు జరిపినా స్పందన లేదన్నారు. రైల్వేజోన్‌పై నాలుగేళ్లుగా పరిశీలిస్తున్నామని చెబుతున్నారు తప్ప ఎలాంటి ముందడుగు పడలేదన్నారు. రైల్వేజోన్‌ కోసం అన్ని పార్టీలు ఏకమై పోరాడాలని ఆయన్నపాత్రుడు పిలుపునిచ్చారు. ఎంపీ కొనకళ్ల మాట్లాడుతూ కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టడానికే దీక్ష చేస్తున్నామని తెలిపారు. విభజన హావిూలు అమలు చేసే వరకు పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని ఎంపీ కొనకళ్ల విమర్శించారు. విశాఖ ఉక్కు స్ఫూర్తితో రైల్వేజోన్‌ సాధించాలని ¬ంమంత్రి చినరాజప్ప అన్నారు. రైల్వేజోన్‌ దీక్షలు టీడీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.