రాష్ట్ర వ్యాప్తంగా సజావుగా ధాన్యం కొనుగోళ్లు
చిన్నిచిన్న పొరపాట్లను పెద్దవిగా చూడరాదు
7,172 సెంటర్లలో 39.51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
పౌరసరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్
హైదరాబాద్,మే 23 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయని పౌరసరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్ పేర్కొన్నారు. అయితే పెద్ద సంఖ్యలో కొనుగోళ్లు జరిగినప్పుడు చిన్న చిన్న లోపాలు జరగడం సహజమని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై చౌహాన్ విూడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తి కావొస్తోందన్నారు. ధాన్యం కొన్న తర్వాత రైతులకు డబ్బులు పడ్డాయా లేదా అనేది ప్రతీ సెంటర్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. 7,172 సెంటర్‌లలో 39.51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. తెలంగాణ బియ్యానికి మంచి బ్రాండ్ ఏర్పడిరది. ఈ నేపథ్యంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కొనుగోలు కేంద్రాల వద్ద నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ధాన్యం తరుగు అనేది అవాస్తవం.. కొనుగోలు కేంద్రాల వద్ద క్లీనింగ్ మిషన్లు పెట్టాము. క్లీనింగ్ ఉన్న ధాన్యంలో ఒక్క కిలో కూడా కటింగ్ లేదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే ధాన్యం క్లీన్‌గా ఉండాలని ఆదేశాలు ఉన్నాయి. ధాన్యంలో మట్టి, చిన్న రాళ్ళు, డస్ట్ ఉంటే సమస్య వస్తుంది. బకాయిలు ఉన్న మిల్లర్లకు ధాన్యం ఇవ్వలేదు. కొంతమంది మిల్లర్ల వద్ద కోట్ల రూపాయలు పెండిరగ్‌లో ఉన్నాయి. అందుకే వాళ్లకు ధాన్యం ఇవ్వలేదు. నీతినిజాయితీగా పని చేస్తున్నాం. మిల్లర్ల వద్ద డబ్బులు అధికారులు డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు చేయడం సరికాదు. ఆధారాలుంటే నిరూపించాలన్నారు. మాపై అసత్య ఆరోపణలు చేయడం వల్ల మాకే కాదు రైతులకు కూడా ఇబ్బంది అవుతుంది. ఆధారాలు లేని అవాస్తవాలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని చౌహాన్ హెచ్చరించారు.