రాష్ట్ర సంక్షేమం పథకాలను దేశానికి ఆదర్శం

జిల్లా పరిషత్ చైర్మన్ సరిత అలంపూర్ జనంసాక్షి (సెప్టెంబర్ 21)
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన,సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి ,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత అన్నారు.
అలంపూర్ మున్సిపాల్టీ మరియు మండలం పరిధిలోని వివిధ గ్రామాల వారికి పండుగ కానుకగా ఇచ్చే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మండల అధికారులు బుధవారం ఏర్పాటు చేశారు. చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం మరియు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత హాజరై వారి చేతుల మీదుగా చీరలు పంపిణీచేశారు.అలాగే ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ సరిత మాట్లాడుతూ,
తెలంగాణ ఆడ బిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పండుగ కానుకగా ఇచ్చే బతుకమ్మ చీరల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైందని,అందులో భాగంగా అలంపూర్, మున్సిపాలిటీ, మండలం పరిధిలోని వివిధ గ్రామాల వారికి చీరల పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.దేశంలో ఏ రాష్ట్రం కూడా చేపట్టని గొప్ప కార్యక్రమం కేసీఆర్ చేస్తున్నారని, అన్ని కులల,మతాలకు అతీతంగా అందరికీ పండుగ కానుకగా బట్టల పంపిణీ తెరాస ప్రభుత్వం చేస్తుందని గుర్తుచేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్టాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్నరు అని తెలిపారు. రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా రాష్ట్రం మొత్తం ఉన్న మహిళల కోసం రూ. 338కోట్లు ఖర్చు చేసి,చేనేత చీరలను 32 రకాల డిజైన్లతో బతుకమ్మ చీరలు,రకాల డిజైన్లతో పంపిణీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మనోరమ, చైర్మన్లు వైస్ వెంకటేశ్వర్ రెడ్డి, తాసిల్దార్ శభాష్ నాయుడు, అయ్యా శాఖల అధికారులు,మరియు మండల స్థాయి ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచ్లు,ఎంపీటీసీలు, మరియు వివిధ వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, అధికారులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.