రింగ్ రోడ్డు భూ సర్వే వేగవంతం చేయాలి

రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు
యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి.
ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాలకు సంబంధించి భూ సర్వేలను వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు కోరారు. మంగళవారం సంబంధిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రీజనల్ రింగ్ రోడ్డు పనులను సమీక్షించారు. భూ సర్వే గురించి పలు సూచనలు జారీ చేశారు. సర్వే పనులు నెలలో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, భువనగిరి ఆర్డీఓ భూపాల్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.