రీడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 150 మంది విద్యార్థులకు బ్యాగులు, నోటు పుస్తకాలు వితరణ
టేకులపల్లి ,ఆగస్టు 29( జనం సాక్షి): రీడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మర్లపాటి లక్ష్మీ ఫౌండేషన్ వారి ఆర్థిక సహకారంతో మండలంలోని టేకులపల్లి ,లచ్చతండా , సింగ్యా తండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 150 మంది విద్యార్థులకు బ్యాగులు, నోటు పుస్తకాలు ,జామెట్రీ బాక్సులు, పెన్నులు సోమవారం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి సర్పంచ్ బోడ సరిత, గోల్య తండా సర్పంచ్ బోడ నిరోష ,దాస్తండా సర్పంచ్ బానోతు ప్రియాంక ,ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గ్రామస్తులు రవి, ద్వాలియా, మంగీలాల్ విద్యా కమిటీ చైర్మన్ లు, రీడ్ ఫౌండేషన్ అధ్యక్షులు బోడ గన్న ,శ్రీనివాస్, రవిరాజ్ ,రమేష్, రవీందర్, రవి చౌహాన్, నరేష్, కిషన్ ,మర్లపాటి చైర్మన్ వీరస్వామి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.