రీ డిజైనింగ్‌ పేరుతో కొంపముంచారు

వరద బాధితులను వెంటనే ఆదుకోవాలి

కరీంనగర్‌,జూలై 29(జనంసాక్షి ): కేసీఆర్‌ అనాలోచిత నిర్ణ యాలు, ప్రాజెక్టుల నిర్మాణాలతోనే జిల్లాలో వరద బీభత్సం సృష్టించిందని బిజెపి నేతలు అన్నారు. రీ డిజైనింగ్‌ అంటూ కాళేశ్వరంతో ప్రజలను ముంచారని అన్నారు. దీనికి బాధ్యుల కేవలం కెసిఆర్‌ తప్ప మరొకరు కాదని అన్నారు. ఇండ్లలోకి వరద నీరు చేరి పెను నష్టాన్ని సృష్టించిందని, అధికారులు ముందస్తు హెచ్చరిక చేయక పోవడం వల్లనే వారు సర్వస్వం కోల్పోయి రోడ్డున పడాల్సిన దుస్థి తి నెలకొందన్నారు. వరదల కారణంగా జీవితకాలంలో ఊహించని నష్టం జరిగిందని, ప్రభుత్వం తక్షణమే మేల్కొని నిరుపేదలను ఆదుకోవాలన్నారు. వరద ప్రాంతాల్లో చెత్తను తొలగించకపోవడతో దుర్వాస వస్తోందని,క్రిమికీటకాలు చేరి వారికి అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉందన్నారు. మంచినీటి సదుపాయాలు మెరుగుపర్చాలని, వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు.
ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటించాలి ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటించి సమగ్ర నివేదిక ప్రకారం నష్టపోయిన వారికి సహాయాన్ని అందించాలని పేర్కొన్నారు. మున్ముందు ప్రమాదాలు జరక్కుండా శాశ్వత పరిష్కారాన్ని చూపించాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. ప్రభుత్వాలు బాధ్యతయుతంగా వ్యవహరించాలని, కాని నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

తాజావార్తలు