రుణాలు చెల్లించడం లేదని గ్రామైక్య సంఘాల సభ్యుల ఇండ్లకు తాళాలు వేసిన బ్యాంక్ అధికారులు
భీమదేవరపల్లి, ఆగష్టు 2 (జనంసాక్షి):భీమదేవరపల్లి మండలంలోని రంగయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కాశతురక కాలనీలో బ్యాంకు రుణాలు చెల్లించడం లేదని మహిళ గ్రామైక్య సంఘాల సభ్యుల ఇండ్లకు బుధవారం బ్యాం కు రీకవరి అధికారులు తాళాలు వేశారు. ఈ సంఘటనలో బ్యాంకు సిబ్బందికి మహిళలకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. గ్రామస్థుల కథనం ప్రకారం 2007 సంవత్సరంలో 7మహిళ గ్రామైక్య సంఘాలు 90 మంది సభ్యులతో 30లక్షల వరకు దక్కన్ గ్రామీణ బ్యాంక్ నుండి అప్పు తీసుకున్నారని, తీసుకున్నప్పటి నుండి రుణాలు సరిగ్గా చెల్లించ కపోవడంతో కరీంనగర్ దక్కన్ గ్రామీణా బ్యాంక్ రీకవరి అధికారులు కాలనీ సభ్యుల ఇంటిలోని సామానులు బయటపడేసినట్లు గ్రామస్థులు తెలిపారు.
రంజాన్ మాసం ఉన్నందున కొద్ది రోజులు గడువు ఇవ్వాలని ప్రాధేయపడ్డాగాని బ్యాంకు అధికారులు వినిపించుకోలేదని, దీంతో కొందరు మహిళా సభ్యులు రుణాలు చెల్లిస్తామని హామి ఇవ్వడంతో బ్యాంకు అధికారులు వెనుదిరిగినట్లు వారు తెలిపారు.