రూపాలు మార్చారు… శాస్రోక్తంగా పూజల్లేవు

గర్భాలయంలో పూజలు సక్రమంగా లేవు
విూ కళ్లు తెరిపించడానికే భారీ వర్షాలు కరిపిస్తున్నా
లష్కర్‌ బోనాల రంగంలో స్వర్ణలత ఆగ్రహం

హైదరాబాద్‌,జూలై18(జనంసాక్షి): ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఆలయంలో సరిగ్గా పూజలు చేయడం లేదని, ప్రతీ ఏడాది మొక్కుబడిగా పూజలు నిర్వహిస్తున్నారని ఆక్షేపించారు. భక్తుల సంతోషం కోసం పూజలు అందుకుంటున్నా. కానీ ఇష్టపూర్వకంగా పూజలు అందుకోలేకపోతున్నా. ఈ విషయం ప్రతీ ఏడాది నా నోటితో చెప్పించాలనుకుంటున్నారు. పూజల విషయంలో సంతోషంగా లేనని చెప్పినా… మారడం లేదు. నా బిడ్డలే కదా అని కడుపులో పెట్టుకుంటున్నా. గర్భాలయంలో శాస్తోక్తర్రగా పూజలు నిర్వహించాలి. మొక్కుబడిగా కాకుండా పూజలు సక్రమంగా చేయాలని అన్నారు. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతున్నది. అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. తన భక్తులను ఎలాంటి ఆపద లేకుండా చూసుకుంటానని, కంటతడి పెట్టకుండా పూజలు చేయాలని, కోరుకున్నది తప్పక నెరవేరుతుందని భవిష్యవాణి చెప్పారు. గర్భిణులకు, బాలింతలకు ఎటువంటి బాధలు రానివ్వనని అమ్మవారి వాక్కుగా చెప్పారు. సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఆషాఢ బోనాల జాతర సందర్భంగా రెండోరోజు సోమవారం రంగం కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి విగ్రహానికి భక్తులు అడ్డుగా నిలబడవద్దని సూచించారు. అమ్మవారికి పూజలు మొక్కుబడిగా చేస్తున్నారని అన్నారు. సంతోషంగా పూజ చేస్తున్నానంటున్నారు… విూ హృదయం విూద చేయి పెట్టి ఎంత సంతోషంగా చేస్తున్నారో చెప్పండి… నాకు పూజలు అందుతున్నాయో లేదో విూరే చెప్పండి.. ప్రతి ఏటా నా నోటితో చెప్పిస్తున్నారు. నా గుడిలో పూజలు సరిగా జరపడం లేదు.. విూరు గర్భాలయంలో శాస్త్రబద్ధంగా పూజాలు చేయండి.మొక్కుబడిగా చేయకండి., ప్రతి ఏడూ నాకు ఆటంకమే చేస్తున్నారు. ఎన్ని రూపాల్లో నన్ను మారుస్తారు.. విూకు నచ్చినట్టు నన్ను మారుస్తారా? నేను విూ హృదయాల్లో చేరి పలుకు వినిపిస్తున్నా.. విూరు పెడదోవ పడుతున్నారు. స్థిరమైన రూపంలో నేను కొలువుదీరాలి అనుకుంటున్నా.., నా రూపాన్ని స్థిరంగా నిలపండి. విూ కళ్లు తెరిపించడానికే నేను కుంభ వర్షాలు కురిపిస్తున్నాను.. నా ఆగ్రహం తట్టుకోలేరనే గోరంత చూపుతున్నాను.. కొండంత తెచ్చుకుంటున్నా.. నాకు గోరంత పెడుతున్నారు.‘ అంటూ మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. స్థిరమైన రూపంలో నేను కొలువుదీరాలని అనుకుంటున్నా. నా రూపాన్ని స్థిరంగా నిలపండి. విూరేంటి నాకు చేసేది.. నేను తెచ్చుకున్నదే కదా. దొంగలు దోచినట్లుగా నా నుంచే విూరు కాజేస్తున్నారు. నా విగ్రహ ప్రతిష్ఠను ఏడాదిలోపు నాకు స్థిరంగా చేయండి. ఎటువంటి ఆపద లేకుండా మిమ్మల్ని బాగా చూసుకుంటా. విూరు కోరుకున్నది తప్పక నెరవేరుతుంది. కంటతడి పెట్టకుండా నాకు పూజలు చేయండి. విూరు ఎన్ని తప్పులు చేసినా నా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నా. గర్భిణులు, బాలింతలకు ఎటువంటి రానివ్వను’ అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కాగా, రంగం కార్యక్రమం నేపథ్యంలో మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనం నిలిపివేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.