రూసో కళాశాలతో పాటు ఆదర్శ పాఠశాల ఆనంద్ విద్యానికేతన్ మండలంలో వివిధ పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి
బోయిన్ పల్లి సెప్టెంబర్ 24 (జనం సాక్షి)రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం రూసో కళాశాలలో బీఈడీ ఎంబీఏ విద్యార్థులు, మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ,ఆనంద్ విద్యానికేతన్ తో పాటు మండలంలో వివిధ పాఠశాలల్లో శనివారం రోజు ముందస్తుగా బతుకమ్మ పండుగ వైభోపీతంగా నిర్వహించారు. పాఠశాలల ప్రాంగణంలో బతుకమ్మ శాస్త్రోత్తకంగా పండగను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచానికి మన తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పిన పండగ బతుకమ్మని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ సాంస్కృతి సాంప్రదాయాన్ని క్రమం తప్పకుండా పాటించి ఉత్తమంగా వ్యవహరించాలని కోరారు బొడ్డెమ్మ ఆరంభం నాటునుండి మహా అష్టమి వరకు బతుకమ్మ ఆటను ఆకాశమే హద్దుగా అన్నట్టు వివిధ రకాల జానపద గేయాలు ప్రకృతి పులకరించే పాటలతో చూడచక్కగా వేడుకలను జరుపుకుంటారని వారు చెప్పారు బతుకమ్మలను విద్యార్థులు వివిధ రూపాల్లో తయారుచేసి వారి ఆనందాన్ని కోలాటం ద్వారా ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో రుషో కళాశాల ప్రిన్సిపాల్ దేవేందర్,సంపత్ కుమార్,ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర్, ఆనంద్ విద్యానికేతన్ ప్రదనోపాధ్యాయులు బిల్ల ఆనందం,రుషో అధ్యాపక బృందం రాజ్ కుమార్,వెంకటేశం,బాలకిషన్,సురేష్,మోహన్,సత్యం,శ్రీనివాస్,ప్రసాద్, విద్యార్థులు ఉన్నారు