రూ. 40 లక్షలతో పట్టుబడ్డ వ్యక్తి
హైదరాబాద్:నాంపల్లి రైల్వే స్టేషన్‌లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఓ వ్యక్తి నుంచి ఆధారాలు లేకుండా ఉన్న రూ.40లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆ సొమ్ముకు సంబంధించి అతని వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో డబ్బును స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లి నుంచి శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు రైల్వే స్టేషన్‌కు వచ్చినట్లు పోలీసుల విచారణలో పట్టుబడ్డ వ్యక్తి తెలిపాడు.